అంగవైకల్యం అడ్డుకాలేదు.. పోలీస్ కావాలన్న రాహుల్ కల సాకారం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా :- శారీరక వైకల్యం ఉన్నా, మనసులోని ఆశయాన్ని ఎవరూ అడ్డుకోలేరని దమ్మాయిగూడకు చెందిన రాహుల్ నిరూపించాడు. చిన్నప్పటి నుంచే పోలీస్ అధికారిగా మారాలన్న కలతో ఉన్న రాహుల్‌కు ఆ కలను ఒకరోజైనా నిజం చేసే అవకాశం కల్పించి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి మానవత్వాన్ని చాటారు. పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న రాహుల్‌ను కమిషనరేట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించిన సీపీ సుమతి, తన కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ టోపీ ధరింపజేశారు. అధికారిగా వ్యవహరించే అనుభూతిని కలిగించి అతని జీవితంలో...