అంతాయిపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్, పండ్లు అందజేత

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, కీసర సర్కిల్, శామీర్‌పేట్ డివిజన్‌లోని అంతాయిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం సజావుగా అమలయ్యేందుకు పాఠశాలకు అవసరమైన వంట పాత్రలు, ఇతర వంట సామాగ్రిని అందజేశారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుగా నోట్ పుస్తకాలు, ఆరోగ్యకరమైన ఆహారం కోసం పండ్లను కూడా...