🔸రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి భావోద్వేగం
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధం ప్రపంచంలోనే గొప్ప బంధమని అన్నారు.ప్రతి ఏడాది రాఖీ పండుగ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లు తన వద్దకు వచ్చి రాఖీలు కడుతుంటారని మల్లారెడ్డి తెలిపారు. తనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారని, వారితో ఎంతో ఆప్యాయమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. అయితే గత ఏడాది తన అక్కల్లో ఒకరు మృతి చెందారని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రతి రాఖీ పండుగకు అక్కాచెల్లెళ్లు వచ్చి రాఖీ కట్టడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, వారి ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని మల్లారెడ్డి అన్నారు. రక్షాబంధన్ పండుగ ప్రతి ఇంటా సోదరసోదరీమణుల మధ్య ప్రేమానురాగాలను మరింత పెంచాలని ఆకాంక్షించారు.
🔸మల్లారెడ్డికి,మర్రి రాజశేఖర్ రెడ్డికి రాఖీ కట్టిన ఎల్లంపేట కౌన్సిలర్లు
రక్షాబంధన్ సందర్భంగా ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని, మల్కాజిగిరి మర్రి రాజశేఖరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు వారికి రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని కౌన్సిలర్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి తో పాటు పలువురు కౌన్సిలర్లు నిశిత నాయకులు పాల్గొన్నారు.