అదనపు కట్నం వేధింపుల కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష

ఆర్ జె న్యూస్, కీసర : అదనపు కట్నం కోసం భార్యను శారీరక, మానసిక వేధింపులకు గురిచేసి ఆమె అనుమానాస్పద మృతికి కారణమైన భర్తకు న్యాయస్థానం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. కీసర పోలీస్ స్టేషన్‌లో 2019 ఆగస్టు 8న క్రైమ్ నెం. 367/2019గా నమోదు చేసిన ఈ కేసులో, వివాహానంతరం అదనపు కట్నం కోసం భార్య శ్రావణిని వేధింపులకు గురిచేయడంతో పాటు, ఆమె అనుమానాస్పద మృతికి కారణమైనట్లు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సేకరించిన బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో సమర్పించగా, కేసు...