RJNEWS TELUGU
Date of Publish : 30 June 2026, 7:14 pm Posted by : RJ NEWS TELUGU

అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ నేత మారన్నను పరామర్శించిన కవిత

మేడ్చల్, జూన్ 30: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎత్తారి మారన్న గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం మేడ్చల్‌లోని మెడినోవా ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మారన్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్న కవిత, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది. మారన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మారన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కవిత, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి గుర్రం వెంకటేష్, మహిళా అధ్యక్షురాలు స్వర్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.