అలియాబాద్‌లో అభివృద్ధి పనులకు ఆమోదం కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు

మేడ్చల్ ఆర్జేన్యూస్ : అలియాబాద్ పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్ సమావేశం సోమవారం చైర్‌పర్సన్ కంటం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. పురపాలక సంఘ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణ అంశాలపై చర్చించి పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ప్రభుత్వం నిర్వహించనున్న వనమహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. గ్రీన్‌ బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించి పట్టణంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని తీర్మానించారు.స్వచ్ఛ భారత్‌ మిషన్‌...