అలియాబాద్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం..! లబ్ధిదారుల ఇంటిని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శిరీష కృష్ణారెడ్డి..!

మేడ్చల్, జూన్ 30 ( ఆర్ జె న్యూస్ ) : మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ గ్రామం 7వ వార్డులో గాదె మంజుల-శ్రీనివాస్ దంపతులు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ "పేదల సంక్షేమం కోసం...