ఆర్ జె న్యూస్, మేడ్చల్, అలియాబాద్ :
ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావాలనే లక్ష్యంతో అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ – Special Intensive Revision కార్యక్రమం నిర్వహించారు. అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో అలియాబాద్ గ్రామం మరియు లాల్గాడి మలక్పేట్ గ్రామాల్లో బూత్ నెం. 117, 118, 119, 120, 125, 126, 127, 128, 129 పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుంకి రమేష్ మాట్లాడుతూ “ఓటు మన హక్కు – ఓటు మన భవిష్యత్తు” అని అన్నారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని వారు వెంటనే నమోదు చేయించుకోవాలని, వివరాల్లో ఏవైనా తప్పులు, మార్పులు ఉంటే సరిదిద్దుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని నిజమైన ఓటర్ల హక్కులు కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు బూత్ ల వారీగా ఇళ్లకు వెళ్లి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత, పేరు తొలగిపోయిన వారు, చిరునామా మారిన వారి వివరాలను నమోదు చేసేందుకు సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో-ఆర్డినేటర్ బొల్లబోయిన నాగమణి, మాజీ సర్పంచ్ కంఠం కృష్ణ రెడ్డి, చిలుగురి మల్లేష్, బండి సతీష్, BLOలు, BLAలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.