అలియాబాద్‌లో ప్రజా సమస్యలపై బీజేపీ నేతల పర్యటన

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : "మీ సమస్య–మా పరిష్కారం" కార్యక్రమంలో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డులోని ప్రజా సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను బీజేపీ రాష్ట్ర నాయకురాలు, మహిళా శక్తి మై వాయిస్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎన్. హైమారెడ్డి కోరారు. ప్రజల ఆహ్వానం మేరకు వార్డులో పర్యటించిన ఆమె రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి సరఫరా, గృహాలపై వసూలు చేస్తున్న పన్నుల అంశాలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌ను కలిసి పెండింగ్‌లో ఉన్న సమస్యలను...