అలియాబాద్ కౌన్సిల్‌లో కీలక తీర్మానాలు
♦️ పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ పనులకు ఆమోదం ఆర్ జె న్యూస్ శామీర్ పేట : అలియాబాద్ పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనులకు సంబంధించిన పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. శుక్రవారం అలియాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రహదారుల మరమ్మతులు, పార్కుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.వనమహోత్సవం నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ అమలు, బోనాల పండుగ ఏర్పాట్లు,...