RJNEWS TELUGU
Date of Publish : 10 September 2026, 7:58 am Posted by : RJ NEWS TELUGU

అలియాబాద్ లో బతుకమ్మ ఘాట్ కు భూమిపూజ

ఆర్.జె.న్యూస్, శామీర్ పేట : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.10 లక్షల మున్సిపల్ జనరల్ నిధులతో నిర్మించనున్న బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ ఘాట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే బతుకమ్మ పండుగ నాటికి మహిళలకు, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. పండుగను ప్రజలు సౌకర్యవంతంగా జరుపుకునేందుకు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ కన్నెరెడ్డి మాలతి మాధవరెడ్డి, కౌన్సిలర్లు గాదె వెంకటేష్, గూదె వెంకటేష్, వాడగం శ్యామ్, వంగరి దినేష్, మున్సిపల్ ఏఈఈ సనా షహీన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.