ఆర్.జె.న్యూస్, మేడ్చల్: అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తక్షణమే పరిష్కరించాలని CITU మండల కమిటీ డిమాండ్ చేసింది. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం నేడు చేపట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా CITU బాచుపల్లి మండల కన్వీనర్ రాథోడ్ సంతోష్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని CITU నాయకులు పి. స్వామి, పి. భాస్కర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కుల కోసం పోరాడుతున్న వారిని అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ప్రధాన డిమాండ్లు :
– ప్రీ, ప్రైమరీ, పీఎంశ్రీ 4,131 కేంద్రాలను రద్దు చేసి అంగన్వాడీలకు అప్పగించాలి.
– ICDSకు నిధులు పెంచి బలోపేతం చేయాలి.
– కాంగ్రెస్ హామీ ప్రకారం రూ.18 వేల వేతనం, PF సౌకర్యం కల్పించాలి.
– 15 వేల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
– BLO పెండింగ్ డబ్బులు, SIR డ్యూటీ అమౌంట్ వెంటనే చెల్లించాలి.
– పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ టీచర్ల ఏరియర్స్, PRC ఏరియర్స్, 24 రోజుల సమ్మె వేతనాలను విడుదల చేయాలి.