అసెంబ్లీలో అంగన్వాడీల సమస్యలపై చర్చించాలి – CITU డిమాండ్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్: అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తక్షణమే పరిష్కరించాలని CITU మండల కమిటీ డిమాండ్ చేసింది. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం నేడు చేపట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా CITU బాచుపల్లి మండల కన్వీనర్ రాథోడ్ సంతోష్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని CITU నాయకులు పి. స్వామి, పి. భాస్కర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కుల కోసం పోరాడుతున్న వారిని అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు...