ఆడిట్‌లో అనుకూల నివేదికకు రూ.50 వేల లంచం

🔸నిర్మల్‌లో ఇద్దరు రాష్ట్ర పన్నుల శాఖ అధికారుల అరెస్ట్‌.. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సీనియర్‌ అసిస్టెంట్‌ ఆర్.జె.న్యూస్,నిర్మల్‌ : ఆడిట్‌లో ఎలాంటి తప్పులు చూపకుండా అనుకూల నివేదిక ఇచ్చేందుకు జువెల్లరీ వ్యాపారి నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటూ రాష్ట్ర పన్నుల శాఖకు చెందిన ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్‌ రేంజ్‌ ఏసీబీ అధికారులు సోమవారం నిర్మల్‌ స్టేట్‌ టాక్స్‌ కార్యాలయంలో నిర్వహించిన ఆపరేషన్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ మంత్రి సాయికృష్ణను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఎస్టీఓ కొప్పెల గోదావరిని కూడా...