ఆధ్యాత్మిక భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలి..! ముషీరాబాద్ మహంకాళి ఆలయంలో బంగారు ఆభరణ సమర్పణ
ఆర్ జె న్యూస్, హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలని చరిత్రక ముషీరాబాద్ మహంకాళి ఆలయ ప్రధాన అర్చకుడు చంద్ర మౌళి అన్నారు. శనివారం నిజామాబాద్‌కు చెందిన భక్తుడు శివకుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముషీరాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఐదు తులాల బంగారు ఆభరణాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశానని, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్తున్న సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని...