ఆపదలో విద్యార్థికి అండగా సీఎంఆర్.. ఉచిత వైద్యం, రూ.1.90 లక్షల ఆర్థిక సాయం
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలో కండ్లకోయలోని సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ రెండో సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) చదువుతున్న విద్యార్థి నాగ సతీష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, సీఎంఆర్ విద్యాసంస్థల యాజమాన్యం మానవత్వాన్ని చాటింది. విషయం తెలుసుకున్న సీఎంఆర్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్ గోపాల్ రెడ్డి వెంటనే స్పందించి విద్యార్థికి అన్ని విధాలా అండగా నిలిచారు.చైర్మన్ ఆదేశాల మేరకు నాగ సతీష్‌ను సీఎంఆర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి, అవసరమైన వైద్య...