ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల పెంపు ‘క్యాచ్ ది రైన్–2026’ను విజయవంతం చేయాలి: చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇంటి వద్ద, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, అపార్ట్‌మెంట్లలో తప్పనిసరిగా వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కె. శిరీష కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.జల్ శక్తి అభియాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న 'క్యాచ్ ది రైన్–2026' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకించడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని, బోర్‌వెల్‌లలో నీటి లభ్యత మెరుగై తాగునీటి...