RJNEWS TELUGU
Date of Publish : 19 July 2026, 6:12 pm Posted by : RJ NEWS TELUGU

ఉద్యమకారులకు 20% రిజర్వేషన్లు కల్పించాలి..! సీఎం హామీలు వెంటనే అమలు చేయాలి: డా. చీమ శ్రీనివాస్

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా :

తెలంగాణ ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉద్యమకారుల గుర్తింపులో కేకే కమిటీ పేరుతో కాలయాపన చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎల్లంపేట మున్సిపాలిటీ అధ్యక్షుడిగా సుదర్శన్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా పీట్ల సాయిలుకు నియామక పత్రాలు అందజేశారు.కార్యక్రమంలో టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు జిట్టా శ్రీనివాస్ రెడ్డి, సత్తి రెడ్డి, తలారి అశోక్ ముదిరాజ్, జక్కుల కుమార్, రాంచందర్, యాదయ్య, బాలరాజు, బిక్షపతి, చందర్, కురకుల మహేష్, తలారి ప్రభాకర్, ఎండీ రఫీక్, జి. అశోక్, సాయిబాబు, టీ. లక్ష్మణ్, రెడ్డి నాయక్, లింగం గౌడ్, మీట్యా నాయక్, భాస్కర్, శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.