ఉద్యమకారులకు 20% రిజర్వేషన్లు కల్పించాలి..! సీఎం హామీలు వెంటనే అమలు చేయాలి: డా. చీమ శ్రీనివాస్
ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా : తెలంగాణ ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉద్యమకారుల గుర్తింపులో కేకే కమిటీ పేరుతో కాలయాపన చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎల్లంపేట మున్సిపాలిటీ అధ్యక్షుడిగా సుదర్శన్, నియోజకవర్గ...