ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్
తిరుపతి (ఆర్ జె న్యూస్) జూలై 4 : ప్రభుత్వ రుణం మంజూరు పేరుతో లంచం డిమాండ్ చేసిన తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్యను ఏపీ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చేపల పెంపకం కోసం ఒక రైతుకు రూ.50 లక్షల రుణం మంజూరైంది. ఆ రుణం ఫైల్ క్లియర్ చేయడానికి డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్య రూ.6 లక్షలు లంచం అడిగాడు. దీంతో బాధిత రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు ఫిర్యాదు ధృవీకరించి ట్రాప్ ప్లాన్...