ఒడిశా నుంచి గంజాయి తెప్పించి విక్రయాలు..! యువకుడు అరెస్ట్
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్న ఓ యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన అలోక్ సర్కార్ (20) ప్రస్తుతం కిస్తాపూర్ నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు సోహైల్ (22) సహకారంతో ఒడిశా నుంచి 2 కిలోల ఎండు గంజాయిని విక్రయాల కోసం తెప్పించినట్లు విచారణలో వెల్లడైంది.విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు...