ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం SIR పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు తమ పేరు, చిరునామా తదితర వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. జాబితాలో పేర్లు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించి...