ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి : మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకి రమేష్

ఆర్ జె న్యూస్, అలియాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయించుకోవాలని అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అలియాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా...