ఓయూలో బీఆర్ఎస్వీ, దళిత విద్యార్థి సంఘాల నిరసన
ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ నాయకులు దళితుల ముసుగులో నిర్వహించిన నిరసనను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు మిన్నంటాయి. బీఆర్ఎస్వీ, దళిత ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు కొంపల్లి నరేష్, గణేష్ మాదిగ మాట్లాడుతూ.. దళితులు, మాదిగల అంశాలను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. కేసీఆర్...