కరువును ఎదుర్కొనేందుకు అఖిలపక్ష సూచనల మేరకు చర్యలు

🔸ప్రకృతి విపత్తును అధిగమించేందుకు సానుకూల, నిర్మాణాత్మక వైఖరి 🔸తెలంగాణ రాష్ట్రం, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది 🔸మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ  ఆర్ జె న్యూస్, హైదరాబాద్‌ : కరువు పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూల, నిర్మాణాత్మక దృక్పథంతో ముందుకు సాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అంతర్రాష్ట్ర నదీజలాల అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు....