కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ వంటా వార్పు
ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల దగా పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. అంబేద్కర్ నగర్ నోబుల్ స్కూల్ వద్ద రోడ్డుపైనే పొయ్యిలు వెలిగించి వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. మాజీ మేయర్ మేకల కావ్య, నేత చామకూర మహేందర్ రెడ్డి మహిళలతో కలిసి రోడ్డుపైనే భోజనం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మహిళా సంక్షేమాన్ని విస్మరించిందని, తులం బంగారం, రూ.2500,...