ఆర్.జె,న్యూస్ మేడ్చల్ : మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మయోర ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగుల సమ్మె 5 వ రోజుకి చేరింది.ఈ సమ్మెకు మాజీ మంత్రి,మయోరా ఇండియా BRTU యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు..ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కార్మికులపై కక్షసాధింపు చర్యలు, వేధింపులు నిలిపివేయాలని కోరారు.. డిస్మిస్ చేసిన వైస్ ప్రెసిడెంట్ కె. బాలమల్లేష్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కోత విధించిన ఇన్సెంటివ్స్‌ను చెల్లించాలని తెలిపారు.