కార్మికులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆర్.జె,న్యూస్ మేడ్చల్ : మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మయోర ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగుల సమ్మె 5 వ రోజుకి చేరింది.ఈ సమ్మెకు మాజీ మంత్రి,మయోరా ఇండియా BRTU యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు..ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కార్మికులపై కక్షసాధింపు చర్యలు, వేధింపులు నిలిపివేయాలని కోరారు.. డిస్మిస్ చేసిన వైస్ ప్రెసిడెంట్ కె. బాలమల్లేష్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని,...