RJNEWS TELUGU
Date of Publish : 27 August 2026, 11:06 pm Posted by : RJ NEWS TELUGU

కీసరలో ఆస్తి మోసం.. ఇద్దరి అరెస్ట్

ఆర్ జె న్యూస్ డెస్క్ : కీసర పోలీసుల పరిధిలో నకిలీ పత్రాలతో ఆస్తి మోసాలకు పాల్పడిన రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాంపల్లిలో మరణించిన మహిళ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి 300 గజాల ప్లాట్‌ను బదిలీ చేసిన కేసులో మామిడి కృష్ణను అరెస్ట్ చేశారు. మరో కేసులో దమ్మాయిగూడలో నకిలీ ULC అధికారిక లేఖను సృష్టించి 200 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించిన మన్నెం సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి కొనుగోలు ముందు అన్ని ప్రభుత్వ రికార్డులను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని పోలీసులు సూచించారు.