RJNEWS TELUGU
Date of Publish : 22 July 2026, 7:19 am Posted by : RJ NEWS TELUGU

కీసరలో రోడ్డు ప్రమాదం..!DCM, కారు ఢీకొని వృద్ధురాలు దుర్మరణం

ఆర్ జె న్యూస్, కీసర :

రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని DCM వాహనం, ఆ తర్వాత కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం కీసరలో చోటుచేసుకుంది.

⚫ ప్రమాద వివరాలు

కీసర పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్, M.G. నగర్ కు చెందిన ఆరుమాల లక్ష్మి, వయస్సు 60, గత ఐదేళ్లుగా కీసరలోని తన కుమార్తె ఎ. పుష్పలత ఇంట్లో నివసిస్తున్నారు. 21.07.2026 మంగళవారం ఉదయం 05:30 గంటలకు పుష్పలత డ్యూటీకి వెళ్తుండగా ఆమె తల్లి లక్ష్మి బస్ స్టాప్ వరకు సాగనంపడానికి వెళ్లారు. కుమార్తె బస్సు ఎక్కిన అనంతరం లక్ష్మి ఇంటికి తిరిగి వస్తుండగా కీసర హోండా షోరూమ్ ముందు రోడ్డు దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో నాగారం వైపు నుంచి వస్తున్న DCM వాహనం నెం. AP 29 TB 4271 అతివేగంగా వచ్చి లక్ష్మిని ఢీకొట్టింది. ఆమె రోడ్డుపై పడిపోగా, వెనుక నుంచి వస్తున్న కారు నెం. TG 08 W 1164 కూడా ఆమెపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు.

⚫ ఫిర్యాదు మేరకు కేసు

మృతురాలి కుమారుడు ఆరుమాల రంగనాథ్, 40, వృత్తి ఫోటోగ్రాఫర్, ఉదయం 11:00 గంటలకు కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు DCM వాహన డ్రైవర్ నాగారం నివాసి యాదయ్య, కారు డ్రైవర్ పి. రవి, తండ్రి శంకర్, మల్కాజ్‌గిరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన DCM వాహనం, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.