కుమార్తె మృతి.. తండ్రిని కుంగదీసిన విషాదం

ఆర్.జె.న్యూస్, శామీర్ పేట : కన్నకూతురు మృతి ఆ తండ్రిని తీవ్రంగా కుంగదీసింది. కూతురి మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొమ్మరాసిపేట శివారులో చోటుచేసుకుంది. లాల్‌గడిమలక్‌పేటకు చెందిన రాములు (50) మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు అరుణ్‌కుమార్‌ శామీర్‌పేటలో నివాసం ఉంటూ ఫర్నిచర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల కుమార్తె మృతి చెందడంతో రాములు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో బొమ్మరాసిపేట శివారులో...