ఆర్ జె న్యూస్ డెస్క్ : కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని R&B పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. రోడ్ కనెక్టివిటీ, భవన నిర్మాణాలు, బ్రిడ్జ్ ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో ప్రతి తండాకు రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తండాలకు రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారిపై అక్కడికక్కడే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో వాగుల వద్ద కల్వర్టులు, బ్రిడ్జ్ ల నిర్మాణానికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలన్నారు. చెక్ డ్యామ్ తరహాలో బ్రిడ్జ్ లు ఉండేలా డిజైన్లు చేయాలని సూచించారు.
