కొల్చారం గర్భిణులకు మాతృదేవోభవ కానుక

🔸300 మందికి ఉచిత ప్రోటీన్ కిట్ల పంపిణీ - ఆవుల రాజిరెడ్డి ఆర్.జె.న్యూస్, కొల్చారం : గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో “మాతృదేవోభవ” కార్యక్రమం ద్వారా 300 మందికి ఉచిత ప్రోటీన్ కిట్లను పంపిణీ చేశారు. కొల్చారం మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గర్భిణీలకు అందుబాటులో ఉండేలా మండల కేంద్రంలోని బాబా గార్డెన్స్, రంగపేటలోని శ్రీ రంగనాయక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ గర్భిణీలకు...