కోర్టు ఆదేశాల ధిక్కరణ.. పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
ఆర్.జె.న్యూస్, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంకను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆమె కాళ్లకల్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో నత్తి చంద్రకళకు చెందిన ఇంటి నిర్మాణ వ్యవహారంలో కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఆమెపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం తీవ్రమైన అంశంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం...