గచ్చిబౌలిలో భారీ రేషన్ బియ్యం అక్రమ రవాణా భగ్నం – 22 టన్నుల బియ్యం స్వాధీనం
లారీ, 4 టాటా ఏస్‌లు సీజ్ - ఐదుగురు అరెస్ట్ - బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న ముఠా చిక్కింది ఆర్ జె న్యూస్, హైదరాబాద్, గచ్చిబౌలి : పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు అక్రమంగా తరలిస్తున్న ముఠాను సివిల్ సప్లై అధికారులు, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. గౌలిదొడ్డి గురుకుల పాఠశాల సమీపంలో శనివారం నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో అధికారులు ఒక లారీ, నాలుగు టాటా ఏస్ వాహనాలను అడ్డుకున్నారు. వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 22 టన్నుల రేషన్...