గణేష్ మండప నిర్వాహకులతో జవహర్‌నగర్ పోలీసుల సమన్వయ సమావేశం

ఆర్.జె.న్యూస్. మేడ్చల్ : రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో గణేష్ మండప నిర్వాహకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన గణేష్ మండప నిర్వాహకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, మండపాల ఏర్పాటు, భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు.గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రతి నిర్వాహకుడు తప్పనిసరిగా సంబంధిత వివరాలను పోలీస్ స్టేషన్‌లో...