గుండ్లపోచంపల్లిలో కాంగ్రెస్ విభేదాలకు తెర

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు సద్దుమణిగాయి. డివిజన్ అధ్యక్ష పదవి వివాదంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేసిన స్థానిక నాయకులు సీనియర్ నేతల జోక్యంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ చొరవతో అసంతృప్త నాయకులతో జరిపిన చర్చలు ఫలించాయి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా...