గుండ్లపోచంపల్లి రైల్వే అండర్‌పాస్ నిర్మాణానికి కసరత్తు..!

మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 11 :  గుండ్లపోచంపల్లి డివిజన్‌లో ప్రతిపాదిత రైల్వే అండర్‌పాస్ (ఆర్‌యూబీ) నిర్మాణ స్థలాన్ని శుక్రవారం బీజేపీ నాయకులు, రైల్వే ఉన్నతాధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు, రూట్ మ్యాప్‌ను అధికారులు పరిశీలించి, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, గుండ్లపోచంపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం...