RJNEWS TELUGU
Date of Publish : 22 July 2026, 8:50 am Posted by : RJ NEWS TELUGU

గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో పార్టీ బలోపేతంపై చర్చ

⚫ కాంగ్రెస్ నేతలతో వేముల మహేష్ గౌడ్ భేటీ

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మంగళవారం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బండారి నరేందర్ ముదిరాజ్ తో పాటు పలువురు డివిజన్ నేతలతో ఆయన చర్చలు జరిపారు.

⚫ డివిజన్‌లో పార్టీ పరిస్థితిపై సమీక్ష..!

ఈ సందర్భంగా 299 డివిజన్‌లో పార్టీ ప్రస్తుత పరిస్థితి, కార్యకర్తల సమన్వయం, రాబోయే కార్యక్రమాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు.  సర్ కార్యక్రమం డివిజన్‌లో ఎలా కొనసాగుతోందనే వివరాలను సాయిపేట శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

⚫ ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక దృష్టి..!

ఓటరు జాబితా సవరణ – ఎస్‌ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటును పరిరక్షించేందుకు కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. ప్రతిపక్ష కుట్రలను తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

⚫ పాల్గొన్న నేతలు..!

ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్, మాజీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ, మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్, ఎస్సి సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, లేబర్ సెల్ అధ్యక్షులు కావలి భాస్కర్, లక్ష్మినారాయణ స్వామి దేవస్థానం డైరెక్టర్లు ఉదయ్ గౌడ్, బండారి అనిల్, షబ్బీర్, సోను, మాధవ్ రెడ్డి, సంపత్ గౌడ్, కండ్లకోయ వెంకట్, సత్తన్న, ప్రసాద్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.