RJNEWS TELUGU
Date of Publish : 28 July 2026, 1:32 pm Posted by : RJ NEWS TELUGU

గుంతలమయమైన రహదారి..!

🔸మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే రోడ్డే దయనీయ స్థితి 🔸 ఎల్లంపేట్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలో జాతీయ రహదారి నుంచి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. చిన్నపాటి వర్షం కురిసినా రహదారిపై నీరు నిలిచి గుంతలు కనిపించకుండా పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ మున్సిపల్ కమిషనర్ సహా అధికారులు ప్రయాణించే ఈ మార్గమే ఇంత దారుణంగా ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.నిత్యం కార్యాలయానికి వచ్చే దారే ఇలా ఉంటే అధికారులు గుర్తించలేదా ? ప్రజల ఇబ్బందులు కనిపించడం లేదా ? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వెంటనే గుంతలను పూడ్చి రహదారిని మరమ్మతు చేయాలని, ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.