గుంతల రోడ్డుతో ప్రాణాలు పోతున్నాయి – ఈటెలకు వినతి
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ ఎన్‌హెచ్-44పై నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనులను వెంటనే పునఃప్రారంభించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మేడ్చల్ బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు మెమొరాండం సమర్పించారు.. మేడ్చల్ చెక్‌పోస్ట్ నుంచి అత్వెల్లి వరకు ఎన్‌హెచ్-44 రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు తెలిపారు. రహదారి దుస్థితి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం...