గ్యాస్ సిలిండర్ పేలి తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులకు గాయాలు
♦️ అత్యవసరంగా స్పందించిన 108 సిబ్బంది..! ♦️ ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రికి తరలింపు..! ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులు గాయపడిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్ (37) ఇంట్లో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌తో పాటు ఆయన కుమార్తెలు ప్రవళిక (14), హరిప్రియ (10), కుమారుడు విక్రాంత్ (6) గాయపడ్డారు.పేలుడు...