RJNEWS TELUGU
Date of Publish : 03 July 2026, 8:42 pm Posted by : RJ NEWS TELUGU

ఘట్‌కేసర్‌లో విషాదం : రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

ఘట్‌కేసర్ ( ఆర్ జె న్యూస్ ) జూలై 3 :
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలో దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఉమ్మడి వరంగల్ జిల్లా పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష దంపతులు ప్రస్తుతం పెద్ద అంబర్‌పేట్‌లోని కుంట్లూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరు గురువారం రాత్రి ఘట్‌కేసర్ సమీపంలో రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం శుక్రవారం మృతదేహాలను కుంట్లూర్‌లోని వారి నివాసానికి తీసుకువచ్చారు. మృతదేహాలను చూసేందుకు వచ్చిన కాలనీవాసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దంపతులు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.