RJNEWS TELUGU
Date of Publish : 09 September 2026, 8:53 pm Posted by : RJ NEWS TELUGU

ఘనంగా మల్లారెడ్డి జన్మదిన వేడుకలు..! శాలువాతో సత్కరించిన 22వ వార్డు కౌన్సిలర్‌ నిశిత బుచ్చి రెడ్డి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి జన్మదినం సందర్భంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్‌ నిశిత బుచ్చి రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా నిశిత బుచ్చి రెడ్డి మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. మేడ్చల్‌ నియోజకవర్గ అభివృద్ధిలో మల్లారెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.