ఘనంగా సీత్లా పండుగ

ఆర్ జె న్యూస్, మూడుచింతలపల్లి : మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాగిశెట్టిపల్లి తాండలో మంగళవారం గిరిజనులు సీత్లా పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గిరిజనులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నవీన్ నాయక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభం కాగానే సీత్లా (బోనాల) పండుగను నిర్వహిస్తామన్నారు. పంటలు బాగా పండాలని, జీవాలు వ్యాధుల బారిన పడకుండా అమ్మవార్లకు ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు,...