ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : ప్రతి పేదవాడి గుండె చప్పుడు, మాట ఇస్తే మడమ తిప్పని మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు జవహర్ నగర్ లో ఘనంగా జరిగాయి. కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నాయకుడు అబ్బాగోని రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. వైఎస్సార్ కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక శకం అన్నారు. రైతన్నలకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి విప్లవాత్మక పథకాలతో కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యమని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువతరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ యువ నాయకులు పోలాస కిరణ్ కుమార్, జడల బాలకృష్ణ, అందె సురేష్, నిఖిల్, నాగరాజు గౌడ్ తదితర ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
