RJNEWS TELUGU
Date of Publish : 14 July 2026, 9:53 pm Posted by : RJ NEWS TELUGU

చెట్ల కొమ్మల తొలగింపు పనులు.. నేడు విద్యుత్ అంతరాయం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించే నిర్వహణ పనుల కారణంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మేడ్చల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ రాంబాబు తెలిపారు.బాలాజీ నగర్, ఉమా నగర్, వెంకటరామయ్య కాలనీ, చందానగర్, కోర్టు రోడ్డు తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు సహకరించి, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కోరారు.