RJNEWS TELUGU
Date of Publish : 07 September 2026, 9:56 am Posted by : RJ NEWS TELUGU

జగద్గిరిగుట్ట లో భారీ మోసం..! నగదు బంగారంతో ఉడయించిన పాన్ బ్రోకర్

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ జిల్లా జీడిమెట్ల : కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట లో నివాసముండే మార్వాడి రమేష్ స్థానికంగా పాన్ బ్రోకర్ షాపు నిర్వహిస్తుంటాడు. గత కొంతకాలంగా నమ్మకంగా ఉండడంతో స్థానికులు తమ బంగారాన్ని కుదవ పెట్టుకొని డబ్బులు తీసుకున్నారు. వడ్డీలు వసూలు చేసుకుంటూ వ్యాపారం సాగించిన మార్వాడి రమేష్ ఒకసారి గా దుకాణాన్ని ఎత్తేశాడు. తాను ఉండే ఇంటిని సైతం పక్కింటి వారికి అమ్మి కస్టమర్ల సొమ్ము 1 కేజీ బంగారం, భారీగా నగదు తో ఉడాయించినట్లు బాధితులు తెలిపారు. మోసపోయామని గుర్తించిన దాదాపు 35 మంది బాధితులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.