జల్సాలకు అలవాటు.. చోరీలే వృత్తిగా..!
♦️జువైనైల్ హోంలో పరిచయం.. ♦️బైక్ దొంగల ముఠాగా మారిన నలుగురు.. ♦️శామీర్ పేట పోలీసుల వలలో చిక్కిన గ్యాంగ్.. ♦️9 ద్విచక్ర వాహనాల స్వాధీనం.. ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా : జల్సాలకు డబ్బు కావాలి... కష్టపడి సంపాదించాలనే ఆలోచన లేదు. దీంతో చోరీలనే సులభ మార్గంగా ఎంచుకున్న నలుగురు యువకులు వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ పోలీసులకు సవాల్ విసిరారు. చివరకు శామీర్ పేట పోలీసుల అప్రమత్తతతో వారి ఆటకు తెరపడింది. ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురు మైనర్లతో కూడిన...