జవహర్ నగర్ లో తీవ్ర నీటి ఎద్దడి – అధికారులపై ప్రజల ఆగ్రహం

ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జవహర్ నగర్ ప్రజలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈస్ట్ నందమూరి నగర్, శాంతినగర్, గబ్బిలాలపేట, గిరిప్రసాద్ నగర్, డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ప్రభావంతో భూగర్భ జలాలు కలుషితమై తాగేందుకు పనికిరావడం లేదని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీరు వారం రోజులకు ఒకసారి, అదీ అరగంట...